గంటన్నర ముందుగానే రైల్వే స్టేషన్‌కు -ఈ నిబంధ‌న మార్చిన రైల్వేశాఖ‌

-

క‌రోనా వేగంగా విజృంభించిన స‌మ‌యంలో ఎవ‌రూ ప్ర‌యాణాలు చేయ‌లేదు, త‌ర్వాత కొన్ని ప్ర‌త్యేక ట్రైన్లు ఏర్పాటు చేసి వాటిని మాత్ర‌మే రైల్వేశాఖ న‌డిపిస్తోంది, ఈ స‌మ‌యంలో ప్ర‌యాణికుల‌కి హెల్త్ చెక్ అప్ చేసిన త‌ర్వాతే స్టేష‌న్ లోకి ఫ్లాట్ ఫామ్ లోకి అనుమ‌తించారు, అందుకే సుమారు రైలు బ‌య‌లుదేర‌డానికి గంట‌న్న‌ర ముందుగా స్టేష‌న్ కి రావాలి అని తెలిపారు.

- Advertisement -

అయితే ఈ స‌మ‌యంలో వారి ప‌ల్స్ చెక్ చేసి క‌రోనా ల‌క్ష‌ణాలు లేక‌పోతేనే ఫ్లాట్ ఫామ్ లోకి అనుమ‌తించేవారు. తాజాగా ఈ నిబంధనను రైల్వే సడలించింది. ఇక ఆ అవసరం లేదని, ఇంతకు ముందులానే అరగంటముందు వస్తే సరిపోతుందని తెలిపింది.

తాజాగా సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో లేజర్ టెక్నాలజీ సాయంతో అత్యాధునిక థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు లోపలికి అడుగుపెట్టిన వెంటనే అవి దానంతట అవే వారి శరీర ఉష్ణోగ్రతను అంచనా వేస్తాయి. ఇప్పుడు వేగ‌వంతంగా చూస్తున్నారు, అలాగే పండుగ సీజ‌న్ కావ‌డం ట్రైన్లు పెర‌గ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారని తెలుస్తోంది. స్టేష‌న్ కి ప్రయాణికులు మాత్ర‌మే రావాలి, వారికి తోడు అంటూ ఎవ‌రిని రానివ్వ‌డం లేదు, స్టేష‌న్ బ‌య‌ట నుంచే వారు వెనుదిర‌గాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Pawan Kalyan | హిందువులపై అఘాయిత్యాలు ఆపాలి: పవన్ కల్యాణ్

బంగ్లాదేశ్(Bangladesh) వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దారుణ దాడులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,...

Hyderabad | పేలిన ఇంకో ఈవీ బైక్.. 9బైకులు దగ్ధం

హైదరాబాద్(Hyderabad) రామాంతపూర్ పరిధిలో వివేక్ నగర్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం...