బంగారం ధర మళ్లీ మెరిసింది. పసిడి రేటు పరుగులు పెట్టింది. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం దసరా తర్వాత కాస్త మళ్లీ పెరిగింది, అంతర్జాతీయంగా బంగారం ధర పెరగడం కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు.బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగింది.
- Advertisement -
హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరుగుదలతో రూ.51,510కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.220 పెరిగింది. దీంతో ధర రూ.47,220కు పెరిగింది.
బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగింది. వెండి ధర రూ.62,500 దగ్గర నిలకడగా ఉంది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు తగ్గే సూచనలు ఉన్నాయి కాని పెరగవు అంటున్నారు వ్యాపారులు.