శాంసంగ్ ప్రపంచ వ్యాప్తంగా సెల్ ఫోన్ మార్కెట్లో విప్లవాలు సృష్టించింది ఎలక్ట్రానిక్ గూడ్స్ కి కేరాఫ్ అడ్రస్ అయింది, అయితే అంతలా కంపెనీని ముందుకు నడిపించిన వ్యక్తిగా కంపెనీ చైర్మన్ లీ కున్ ఎంతో పేరు సంపాదించారు ప్రపంచంలో…
గత ఆరు సంవత్సరాలుగా హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ కున్ హీ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు, ఆయన మరణించిన విషయం బయటకు వెల్లడించారు.. ప్రపంచంలోనే అత్యధిక స్మార్ట్ఫోన్లు, మెమొరీ చిప్స్ను ఉత్పత్తి చేసింది ఈకంపెనీ..
ప్రస్తుతం శాంసంగ్ టర్నోవర్ దక్షిణ కొరియా మొత్తం జీడీపీలోని ఐదో వంతుతో సమానం, ఆకష్టం వెనుక లీ కున్ కృషి ఎంతో ఉంది.. కొరియాలోని డేగులో 9 జనవరి 1942లో లీ జన్మించారు. శాంసంగ్ వ్యవస్థాపకుడైన తండ్రి లీ బైంగ్ చుల్ మరణం తర్వాత 1987లో లీ శాంసంగ్ బాధ్యతలను చేపట్టి స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేశారు, లక్షలాది మంది ఉద్యోగులు ఈకంపెనీలో పనిచేస్తున్నారు, ఆయనకు అందరూ నివాళి అర్పించారు.