ఉత్తర కొరియా లో కరోనా కేసులు లేవు, దీంతో ఆ దేశం మాత్రం సేఫ్ గా ఉంది..ఇప్పటివరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ మీడియా పలుమార్లు వెల్లడించింది. ఉత్తర కొరియా దక్షిణ కొరియా దేశాలు చైనాలో కరోనా కేసులు వచ్చిన వెంటనే అలర్ట్ అయ్యాయి.. బోర్డర్ క్లోజ్ చేశాయి దీంతో అక్కడకు వైరస్ రాకుండా అడ్డుకున్నారు.
కాని తాజాగా ఉత్తర కొరియా ను మరో సమస్య వేధిస్తోంది. చైనా నుంచి వస్తున్న ఎల్లో డస్ట్ వారిని కలవరపాటుకు గురి చేస్తోంది. చైనా మంగోలియా దేశాల్లోని ఎడారి ప్రాంతం నుంచి గాలి ద్వారా ఈ డస్ట్ చాలా వస్తోంది, అంతేకాదు ఇది చాలా ప్రమాదకరం.
ఎల్లో డస్ట్ లో ఆ దేశంలోని వివిధ రకాల రసాయన కర్మాగారం నుంచి వస్తున్న ప్రమాదకర వ్యర్థ పదార్థాలు గాల్లో కలిసి వేగంగా వస్తున్నాయి. అవి సౌత్ కొరియా నార్త్ కొరియాలో వేగంగా వస్తున్నాయి, దీని వల్ల అక్కడ కరోనా గాలి నుంచి కూడా వచ్చే ప్రమాదం ఉంది అని భావిస్తున్నారు.
దేశ ప్రభుత్వం తాజాగా ప్రజలకు కీలక ఆదేశాలు ఇచ్చింది… ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో ఇళ్లలోంచి బయటకు రాకూడదని తలుపులు కిటికీలు మూసేసుకుని లోపలే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరం ఉంటే మాస్క్ పెట్టుకుని బయటకు రావాలి అని తెలిపింది.