చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు, దీని వల్ల వారికి అనేక సమస్యలు వస్తాయి, అంతేకాదు ఏది తిందాము అన్నా గ్యాస్ ప్రాబ్లమ్ అని నోరు కట్టేసుకుంటారు, మసాలా ఫుడ్ కి దూరంగా ఉంటారు, అయితే, ఈ సమస్య ఉంటే మసాలా ఫుడ్ తినకపోవడం బెటర్ అంటున్నారు వైద్యులు.
అయితే ఇలా ప్రాబ్లమ్ తో బాధపడేవారికి రిలీఫ్ రావాలి అంటే ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి..
రోజూ దానిమ్మ గింజల రసం తీసుకున్నా మంచిదే, అలాగే గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వారు అప్పుడప్పుడూ వాము తీసుకున్నా మంచిది, మీ శరీరంలో సమస్యలు తగ్గుతాయి.
కడుపు శుభ్రం అవుతుంది, గోరు వెచ్చని నీరు తాగాలి. ఇలా చేస్తే పొట్ట ఉబ్బడం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ ట్రబుల్ ఉంటే అస్సలు కూడ్ డ్రింక్ పుల్లటి మజ్జిగ, ఉల్లి రైతాలు, మసాలాలకు దూరంగా ఉండాలి.