కరోనా విజృంభించిన సమయంలో దేశ వ్యాప్తంగా అన్నీ రంగాలు ఇబ్బంది పడ్డాయి, ఆర్ధిక వ్యవస్ధ ఇంకా కోలుకోలేదు, చాలా కంపెనీలు ఉద్యోగులని తొలగించాయి, మరికొన్ని కంపెనీలు జీతాలు కోతలు పెట్టాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కొంత మంది ఉద్యోగుల శాలరీలలో కోత పెట్టింది. తాజాగా వ్యాపారం పుంజుకుంది, దసరాకి మార్కెట్ బాగా అందుకుంది, కరోనా కాస్త తగ్గింది ఈ సమయంలో ఉద్యోగులను సంతోష పెట్టేందుకు రిలయన్స్. కోతపెట్టిన శాలరీలను తిరిగి చెల్లించబోతున్నట్లు ప్రకటించింది.
కొంతకాలంగా ఆపేసిన పెరఫార్మెన్స్ బోనస్ను… పండగ బోనస్గా ఇవ్వబోతున్నట్లు తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలో 3.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరికి అందరికి ఇది అందనుంది, ఇలా ఉద్యోగులకి పెద్ద మొత్తంలో మనీ ఇవ్వాల్సి ఉంటుంది.
అంతేకాదు మరో ఆనందకర వార్త, రిలయన్స్ ఉద్యోగులకి వచ్చే ఏడాది శాలరీలో 30 శాతాన్ని అడ్వాన్స్గా ఇచ్చే ఆఫర్ కూడా తెస్తోంది. ఇలా చేయడం వల్ల వారికి ఇంకా ఉద్యోగంపై నమ్మకం ఉంటుంది, అలాగే వారికి ఆర్ధిక కష్టాలు ఉన్నా తీరుతాయి.ఏప్రిల్ నుంచి రిలయన్స్ కంపెనీ శాలరీల్లో కోతలు పెట్టింది. తన రెమ్యునరేషన్ రూ.15 కోట్లను వదులుకోవడానికి గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సిద్ధపడ్డారు.