జపాన్ దేశం టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలో ముందు ఉంటుంది, అయితే ఇక్కడ జనాభా కూడాఎక్కువే …కాని పుట్టే వారి సంఖ్య బాగా తగ్గుతోంది, అంతేకాదు వివాహాలు చేసుకునేవారు తగ్గుతున్నారు.. పనిపని ఉద్యోగం గుర్తింపు సెటిల్ అవ్వడం వీటిపైనే ఫోకస్ చేస్తున్నారు.. కాని వివాహలు చేసుకోవడం లేదు.
జపాన్ దేశంలో ప్రతి ఏటా సంతానోత్పత్తి తగ్గిపోతోంది. అక్కడి ప్రజల్లో వైవాహిక బంధం, భార్య భర్తల ఏకాంతం తగ్గిపోవడంతో జననాలపై ప్రభావం పడింది. గత 25 ఏళ్ళ నుంచి జపాన్ వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది.. ఎక్కడా యువత కనిపించని స్దితికి వస్తారు అనే భయం కనిపిస్తోంది.
అందుకే ఈ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది… పెళ్లి చేసుకునే జంటకు రూ. 4 లక్షలు అందించాలని నిర్ణయించింది. దేశంలో జననాల రేటు పెరగాలంటే యువ జంటలకు నగదు బహుమతి ఆఫర్ చేసింది…వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు రూ. 4 లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించింది.అయితే 40 ఏళ్ళ వయసు లోపు ఏడాదికి రూ.5.4 లక్షల జీతం ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది.. సో ఇలా కూడా కొన్ని జంటలు ఒకటి అవ్వాలి అని చూస్తున్నాయి.