ఊహించని రేంజ్ లో బంగారం ధర పరుగులు పెట్టింది.. ఇంత భారీగా పెరుగుతుంది అని ఎవరూ ఊహించి ఉండరు.. ఓకే రోజు ఏకంగా వందల రూపాయల పెరుగుదల నమోదు చేసింది, అంతర్జాతీయంగా తగ్గుతుంటే మాత్రం భారత్ లో పెరుగుదల కనపించింది నేడు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.810 పెరుగుదలతో రూ.52,220కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.740 పెరిగింది. దీంతో ధర రూ.47,870కు చేరింది.
బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.600 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,100కు చేరింది. వచ్చే రోజుల్లో ఇంత పెరుగుదల కనిపించినా తగ్గే సూచనలు ఉన్నాయి కాని పెరగవు అంటున్నారు వ్యాపారులు.. ఇది డిసెంబర్ వరకూ ఇలాగే ఉంటుంది అని, జనవరి నుంచి తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.