గతంలో నగదు అవసరం ఉంటే బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకునేవారు… దీని కోసం గంటల సేపు వేచి ఉండేవారు, కాని ఇప్పుడు అంతా ఏటీఎంలు వచ్చేశాయి, సింపుల్ గా ప్రాసెస్ జరుగుతోంది, ప్రస్తుతం డిజిటలైజ్ అయిన కారణంగా మొబైల్, ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యముంది.
అయితే ఇప్పుడు జరిగిన ఓ ఘటన కచ్చితంగా మీరు తెలుసుకోవాలి.ఏటీఎంల్లో డబ్బు తీసుకునేటప్పుడు కేవలం కార్డును వినియోగదారుడు మాత్రమే లావాదేవీలు నిర్వహించాలి. కాదని మీ భార్యకి లేదా మీ భర్తకి ప్రియురాలికి,తల్లికి, తండ్రికి ఇలా ఇవ్వడానికి రూల్ లేదు.
ఈ విషయంలో బ్యాంకులు ముందే హెచ్చరిస్తున్నాయి. ఏటీఎం పిన్ను కేవలం కార్డు హోల్డర్లు మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ ఏటీఎంలో నగదు తీసుకునే సమయంలో మీకు నగదు రాలేకపోయి మీరు కంప్లైంట్ చేస్తే మీరు మాత్రమే ఆ స్వైప్ చేసి ఉండాలి, లేకుండా ఆ కార్డు వేరే వారు వాడి నగదు రాలేదు అని కంప్లైంట్ చేస్తే నగదు ఇచ్చేది కూడా ఉండదు ఇది గమనించుకోండి.సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి ఆ సమయంలో నగదు కోసం ఎవరు కార్డు వాడారు అనేది చూసి ఆకార్డు దారుడు అయితేనే నగదు రిఫండ్ చేస్తారు.