ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ఏడు వారాలు పూర్తి చేసుకుంది, ఎనిమిదో వారం రన్ అవుతోంది, అంతేకాదు ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా అయింది, ఈ వారం ఎవరు ఇంటినుంచి బయటకు వస్తారు అనేది ఈ వారం ఆటతో తేలిపోతుంది, అయితే ఇప్పుడు కొత్త వార్త వినిపిస్తోంది, హౌస్ లో కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అని వార్త వినిపిస్తోంది.
అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏమిటి అని ఆశ్చర్యం రావచ్చు.. అయితే ఇది వాస్తవం అంటున్నారు చాలా మంది అనలిస్టులు, ఎందుకు అంటే మంగ్లీని హౌస్ లోకి ఎంట్రీ ఇప్పించాలి అని చూస్తున్నారట, ఆమె ఇప్పుడే క్వారంటైన్ లో ఉంది అని వార్తలు వస్తున్నాయి. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే 14 రోజుల క్వారంటైన్ పక్కా అనేది తెలిసిందే.
అయితే ఈసారి సరికొత్తగా నడుస్తోంది బిగ్ బాస్.. అందుకే ఎవరూ ఊహించని విధంగా ఆమెని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా పంపాలి అని చూస్తున్నారు, ఇది ఓ సంచలనమే అవుతుంది, మరి ఆమె ఎంట్రీ ఇస్తే మజా వేరుగా ఉంటుంది, ఆమె పాటలతో దుమ్ముదులిపేస్తుంది, మొత్తానికి మంగ్లీ ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది ఈవారం మధ్యలో తేలిపోతుందట. ఇక ఆమెకి భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు అని వార్తలు వస్తున్నాయి.