పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు, ఇప్పటికే సెట్స్ పై వకీల్ సాబ్ ఉంది అలాగే క్రిష్ సినిమా కూడా ఉంది, నవంబర్ లో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు, అంతేకాదు మరో ఇద్దరు దర్శకులకి సినిమా చేస్తున్నట్లు మాట ఇచ్చారు, మరోపక్క బండ్ల గణేష్ నిర్మాతగా మరో సినిమా కూడా ఉండనుంది.
హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఓ మూవీ, సురేందర్ రెడ్డితో ఓ మూవీ ప్రకటించారు, ఇలా మరో నాలుగు చిత్రాలు పవన్ చేతిలో ఉన్నాయి, ఇలాంటి బిజీ సమయంలో తాజాగా ఆయన మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పన్ కోషియమ్ చిత్రానికి రీమేక్ గా తెలుగులో చేస్తున్నారు.
దీనిని సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి
ఈ సినిమాని దాదాపు 45 రోజుల్లో పూర్తి చేస్తారట
అంతేకాదు 30 రోజుల్లో పవన్ షూటింగ్ అయిపోతుందట
ఇందులో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారట
ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటించనున్నారని తెలుస్తోంది
బిల్లా రంగ అనే టైటిల్ పరిశీలనలో ఉంది
2021 మే నెలలో ప్రేక్షకుల ముందుకు చిత్రం తీసుకురానున్నారట
పొలాచ్చిలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట వచ్చే ఏడాదిలో.