ఆ యంగ్ హీరోకి కథ చెప్పిన త్రివిక్రమ్ – నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే ?

-

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ముందు వినిపించే పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఈ మాటల మాంత్రికుడు వెను వెంటనే సినిమాలు సెట్స్ పై పెడతారు అనేది తెలిసిందే, తాజాగా ఈ లాక్ డౌన్ సమయంలో పలు కథలు సిద్దం చేసుకుని హీరోలకి కూడా కొన్ని స్టోరీలు వినిపించారు, అయితే ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు తన నెక్స్ట్ సినిమాను కూడా అనౌన్స్ చేసాడు.

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయనున్నాడు త్రివిక్రమ్. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూట్ తర్వాత ఈ చిత్రం తెరకెక్కించనున్నారు, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నాయి.
అయితే ఇంకా ఈ సినిమాకు బహుశా కొన్ని నెలల సమయం పట్టేలా ఉంది.

అందుకే ఈలోపు మరో సినిమా ఫినిష్ చేయాలి అని భావిస్తున్నారు త్రివిక్రమ్ అని వార్తలు వస్తున్నాయి, తాజాగా ఓ యంగ్ హీరోకి కథ చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రామ్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడని ఫిలిం నగర్ టాక్ నడుస్తోంది, అయితే ఇప్పటికే కథ వినిపించారట,అంతేకాదు ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందని టాక్ నడుస్తోంది, ఇది రామ్ అభిమానులు విని సంతోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...