పెద్దలు చెప్పే మాటలు దేనిని పక్కన పెట్టకూడదు కొన్ని మూడ నమ్మకాలు అనుకున్నా వాటి వెనుక ఎంతో పవర్ ఉంటుంది, అయితే చిన్న పిల్లలకు చాలా మంది ఇంట్లోచూస్తూ ఉంటాం, కచ్చితంగా దిష్టి చుక్క పెడతారు, ఎందుకు అంటే ఎవరి దిష్టి తలగకుండా ఉండాలి అని, నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే మాట మనకు పెద్దలు చెబుతారు.
ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి సమస్యలు వస్తాయి, ఇది పిల్లలపై కూడా ప్రభావం చూపిస్తుంది అందుకే దీనిని పెద్దలు పెడతారు.
బుగ్గపై కాటుక పెట్టాలి. అన్నం తినకుండా మారాం చేస్తే కంటి దృష్టి పడి వుంటుందని భావించి.. రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి. ఆపై ఆ ఉప్పును నీళ్లలో కలిపేయాలి. ఇలా ఐదేళ్ల లోపు పిల్లలకు కచ్చితంగా చేయాలి, కర్పూరహారతి ఇవ్వాలి, వీరికి నిమ్మకాయ మిరపకాయ దిష్టి మాత్రం తీయద్దు, ఐదేళ్లు దాటిన తర్వాత మాత్రమే తీయాలి అంటున్నారు పండితులు. ఐదేళ్ల లోపు పిల్లలకు నిమ్మకాయ మిర్చితో దిష్టి వద్దు అంటున్నారు.