బ్రేకింగ్ — కరోనా టీకాపై సీరం గుడ్ న్యూస్ – టీకా ఎన్ని సార్లు వేసుకోవాలంటే

-

కరోనా టీకా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు, అయితే మన దేశంలో కూడా టీకాపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మరో గుడ్ న్యూస్ వినిపించారు, అదేమిటి అంటే దేశంలో డిసెంబర్ నాటికి కరోనా టీకా కోవిషీల్డ్ అందుబాటులోకి రావచ్చని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా తెలిపారు.

- Advertisement -

తాజాగా జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ డిసెంబర్లో పూర్తయి వచ్చే ఏడాది జనవరిలో టీకా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బృందం వచ్చే నెల నుంచి బ్రిటన్ లో టీకా ఇవ్వాలి అని చూస్తోంది.

ముందు ఈటీకాని వైద్యులు, వైద్య సిబ్బందికి ఇవ్వనున్నారు. బ్రిటన్లో అంతా సవ్యంగా జరిగితే దేశంలో డిసెంబర్ నాటికి టీకాను అందుబాటులోకి తేవచ్చని చెప్పారు. 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నారు.ఒక డోసు టీకా వేసిన 28 రోజుల తర్వాత మరో డోసు టీకా వేయాల్సి ఉంటుంది. ఈ టీకా చౌకగానే వచ్చే అవకాశం ఉంది అన్నారు అదార్ పూనవల్లా.

బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ మూడో దశ పరీక్షలు ప్రస్తుతం వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే, ఆస్ట్రాజెనెకా నుండి లైసెన్స్ పొందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్ లో ఈ టీకా తయారు చేసి ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...