బన్నీ త్రివిక్రమ్ సినిమా కి మరో లేడీ ఓరియెంటెడ్ టైటిల్..!!

బన్నీ త్రివిక్రమ్ సినిమా కి మరో లేడీ ఓరియెంటెడ్ టైటిల్..!!

0
95

చాల రోజుల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఓ సినిమా ని మొదలుపెట్టేశాడు.. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్ననే ప్రారంభం అయ్యింది.. హన్సిక విలన్ గా నటించనుంది.. టబు కీలకపాత్రలో నటిస్తుండగా ఈ సినిమా లో సెకండ్ హీరోయిన్ కోసం గాలింపు జరుగుతుంది.. ఈషా రెబ్బ పేరు వినిపిస్తుంది. దసరా కి ఈ సినిమా ని రిలీజ్ చేయాలనేది దర్శక నిర్మాతల ఆలోచన.. కాగా ఈ సినిమా కి ఎప్పటిలాగా తనదయిన స్టయిల్ లో టైటిల్ ని ఖరారు చేశాడట త్రివిక్రమ్..

ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ టైటిల్స్ ని పెట్టడానికి ఇష్టపడే త్రివిక్రమ్ ఈ సినిమా కి ఆ తరహాలోనే ‘అలకనంద’ అనే టైటిల్ పెట్టబోతున్నాడట.. ఇంతకీ అలకనంద ఎవరు.. ఈ చిత్రానికి ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది తెలియాలంటే మాత్రం సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.. థమన్ సంగీతం సమకూరుస్తుండగా హాసిని అండ్ హారిక బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది..