ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా మారుతుందో తెలియదు, అసలు ఈమె హీరోయిన్ లా ఉందా అని కామెంట్ చేసిన వారే తమ సినిమాలే నువ్వే హీరోయిన్ గా ఉండాలి అని కోరి మరీ తీసుకున్న ఘటనలు ఉన్నాయి, నువ్వు నా పక్కన హీరోయిన్ గా ఏమి సెట్ అవుతావు అన్న కొందరు చివరకు ఆమె నా సినిమాలో ఉండాలి అని చెప్పిన వారు ఉన్నారు, అలాంటి ఓ హీరోయిన్ ని రిజక్ట్ చేసిన హీరోనే ఆమెని వివాహం చేసుకున్నాడు.
ఈమె మన సినిమాలో హీరోయిన్ అని నిరోషాను పరిచయం చేయగానే హీరో రాంకీ నోరెళ్లబెట్టారు.. పనిమనిషిలా ఉంది అని అన్నారు. అయినా డైరెక్టర్ ఆమే హీరోయిన్ అని చెప్పారు.. ఆ తర్వాత ఆమెకి పలు అవకాశాలు వచ్చాయి, రాధిక చెల్లెలు నిరోషను చూసి సింధూరపువ్వులో అవకాశమిశ్చారు డైరెక్టర్ దేవరాజ్.
1988లో తమిళంలో ప్రారంభమైన సింధూ పూవే చిత్రం తెలుగులో సింధూర పువ్వుగా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది. ఆమె హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
బాలకృష్ణతో నారీ నారీ నడుమ మురారీ
చిరంజీవితో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్
మణిరత్నం ఘర్షణ
ఇలా వరుస హిట్ సినిమాలు చేసింది, ఏకంగా ముందు రిజక్ట్ చేసిన హీరో రాంకీ, నిరోషా కలిసి ఏడు సినిమాల్లో చేశారు.ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకన్నారు, ఇప్పుడు ఆమె సీరియల్స్ చేస్తోంది, ఆయన ఆర్ ఎక్స్ 100 సినిమాలో కీలక పాత్రలో చేశారు.