రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగులో సీజన్ 4 సాగుతోంది, ఎంతో అద్బుతంగా ముందుకు సాగుతోంది అని చెప్పాలి, అయితే ఈ దసరాకి మొత్తానికి బిగ్ బాస్ కి హోస్ట్ గా నాగార్జున ప్లేస్ లో సమంత వచ్చారు, అయితే సమంత మూడు గంటలు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అందించారు, అయితే ఆమె మాట్లాడిన మాటలు చూసి అందరూ షాక్ అయ్యారు.
సమంత చాలా బాగా చేసిందని, టాలీవుడ్ లోనే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా భావించారు, అయితే
సమంత తాజాగా దీనిపై మాట్లాడింది.ఎల్లప్పుడూ గుర్తుండిపోయే మంచి అనుభవం ఎదురైందని సమంత చెప్పింది.
ఇలా షోకి నేను హోస్ట్ గా వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు,
తన మామ నాగార్జున వల్లే ఆ షోకి వచ్చానని, ఎన్నో భయాలను అధిగమించాల్సి వచ్చిందని వివరించింది. తనకు తెలుగు సరిగ్గా రాదని, అంతేగాక ఇంతకు ముందు బిగ్బాస్కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని తెలిపింది. ఇక సమంత హోస్ట్ చేసిన విధానం చూసి ఆమె నిజంగా ఎపిసోడ్స్ చూసింది అని అందరూ అనుకున్నారు, అయితే ఇక్కడ దర్శకులు ఇచ్చిన పాయింట్స్ తో షో అద్బుతంగా నడిపింది సమంత అంటున్నారు ఆమె అభిమానులు.