హైదరాబాద్లో సిటీ బస్సులు పూర్తిగా కాకపోయినా కొన్ని సర్వీసులు నడుస్తున్నాయి, అయితే తాజాగా మెట్రోతో పాటు ఈ సిటీ బస్సు సర్వీసులు నడవడంతో ప్రయాణికులకు పెద్ద రవాణా బాధ తప్పింది అనే చెప్పాలి..లేకపోతే చాలా వరకూ జేబుకి చిల్లు పడేది.
ఇక సిటీలో ఆర్టీసీ లో ప్రయాణించే వారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కోవిడ్ కారణంగా విధించాల్సి వచ్చిన లాక్డౌన్ కాలంలో అప్పటికే రెన్యువల్ చేయించుకున్న వారి బస్ పాస్ వృథాగా అయిపోయింది, కొందరు వెయ్యి రూపాయల వరకూ పెట్టి పాస్ తీసుకున్నారు.. వీరు దాదాపు మార్చి నుంచి ప్రయాణాలు చేయక ఆ పాస్ పనిచేయక ఇబ్బంది పడ్డారు.
లాక్డౌన్లో తీసుకున్న బస్ పాస్లో -ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఎయిర్పోర్ట్ లైనర్ పుష్పక్ ఎసీ బస్- ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఉపయోగించుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు కల్పిస్తున్నారు, ఇక వీటిని దగ్గర్లో బస్ కౌంట్లరల్లో ఇచ్చి కొత్త బస్ పాస్ తీసుకోవచ్చు. కొత్త పాస్లో కోల్పోయిన రోజులను కలిపి పాసులు జారీ చేయనున్నారు. ఈ సదుపాయం నవంబర్ 30 వరకు ఉంది.