మహాభారతం విన్నా చదివినా కచ్చితంగా శల్యుడు గుర్తు వస్తాడు, మరి అసలు అతను ఎవరు అనేది చూద్దాం..మహాభారతంలో శల్యుడు మాద్ర రాజ్యానికి రాజు. మాద్రికి స్వయానా సోదరుడు. మాద్రి నకులుడు, సహదేవులకు తల్లి. అలా అతను నకులుడు, సహదేవులకు మేనమామ అయ్యాడు. ఇక పాండవులకి ఎంతో ఇష్టమైన వ్యక్తి.
శల్యుడు యుక్త వయసులో ఉన్నప్పుడు కుంతిని పెళ్ళి చేసుకోవడానికి రాజులతో పోటీపడి ఓడిపోయాడు.. మాద్రి కూడా పాండురాజునే పెళ్ళి చేసుకుంది. శల్యుడు మంచి యుద్ధ వీరుడు బాణాలు అస్త్రాలు బాగా వదిలే వీరుడు..శల్యుని మీద సైన్యం మీద పాండవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
శల్యుడు తన సైన్యంతో పాండవులకు యుద్ధంలో సాయం చేయడానికి వచ్చాడు.. ఈ సమయంలో దుర్యోధనుడు శల్యునికి, అతని సైన్యానికి గొప్ప విందు ఏర్పాటు చేశాడు. శల్యుడు ఆ విందుకు చాలా ఆనందించాడు. ఇక యుద్దంలో సాయం చేస్తాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. ఇక్కడ దుర్యోధనుడు యధిష్టురుని వలే నటించి శల్యుని దగ్గర మాట తీసుకున్నాడు
శల్యుడు గొప్ప రథసారథి అని తెలిసిన దుర్యోధనుడు అతనిని కర్ణునికి రథసారథిగా నియమించాడు, అయితే ఈ సమయంలో కర్ణుడిని యుద్ధం చేసే సమయంలో తన ఎత్తిపొడుపు మాటలతో కర్ణునికి ఆత్మస్తైర్యాన్ని దెబ్బ తీసేలా చేస్తాడు.. కర్ణుడు అర్జునునితో యుద్ధం చేసినప్పుడు రథసారథిగా పనిచేసిన శల్యుడు. ఆ సమయంలో అర్జునుని అదేపనిగా పొగడుతూ కర్ణుని విమర్శిస్తూ యుద్దంలో పాండవులకి సాయం చేశాడు.