చరిత్ర – త్రిశంకు స్వర్గం అంటే ఏమిటి తప్పక తెలుసుకోండి

చరిత్ర - త్రిశంకు స్వర్గం అంటే ఏమిటి తప్పక తెలుసుకోండి

0
433

మనం మాటల్లో అప్పుడప్పుడూ వింటూ ఉంటాం, త్రిశంకు స్వర్గం అనేమాట, అసలు అది ఏమిటి అనేది తెలుసుకుందాం.
ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది, తన పూర్వ వంశీయులు లా కాకుండా, తాను శరీరంగా స్వర్గానికి చేరుకోవాలి అనే కోరిక పుడుతుంది.

వెంటనే ఆయన కులగురువులైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పుతాడు త్రిశంకుడు. శరీరంతో ఇలా స్వర్గానికి వెళ్ళడానికి ఏదైనా యాగం చేయమని కోరతాడు, అయితే ఇది జరగని పని ఇది శాస్త్రాలకు దర్మాలకు విరుద్దం అని వశిష్టుడు చెబుతాడు
వశిష్ఠుని 100 మంది కొడుకుల దగ్గరకు వెళ్ళి తనకోరిక తెలియచేస్తాడు

శరీరంగా స్వర్గానికి వెళ్ళడం అవ్వని కోరిక తీరదు అని కుమారులు కూడా చెబుతారు, మీ వల్ల అవ్వదు నేను వేరే గురువుని కలుస్తా అని అంటాడు. ఆ మాట విన్న వశిష్ఠకుమారులు కోపంతో త్రిశంకుని శపిస్తారు. ఇక తర్వాత రోజు అతని శరీరంపై ఉన్న బంగారు నగలు ఇనుము వస్తువులుగా మారుతాయి

ఇలా త్రిశంకుడు ఛండాలుడుగా మారిపోతాడు. ఇలా ఊరుమీద స్దిమితం లేక తిరుగుతూ ఉంటాడు, ఇలాంటి సమయంలో ఓ రోజు దక్షిణ తీరంలో తపస్సు ముగించిన విశ్వామిత్రుడిని చూసి తన బాధ చరిత్ర చెబుతాడు..త్రిశంకుడి కథ విని సంతోషపడిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో త్రిశంకుడికి అభయం ఇస్తాడు,

యాగం నిర్వహించి శరీరంతో ఛండాలావతారంతో స్వర్గానికి పంపుతానని చెబుతాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రహ్మణులను యజ్ఞానికి ఆహ్వానించమంటాడు. మహోదయుడు అనే బ్రాహ్మణుడు యజ్ఞానికి పిలిచారు,

విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని శరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చిన దారినే వెళ్లమంటాడు. అలా నెట్టి వేయబడ్డ త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ, విశ్వామిత్రా రక్షించు అని ఆర్తనాదం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యంలో ఆపి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి స్వర్గాన్ని, నక్షత్రమండలాన్నిచేయడం ఆరంభిస్తాడు. దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలానికి ఆవల సృష్టించి, త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. అది దీని వెనుక ఉన్న చరిత్ర