ఆదిపురుష్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే

ఆదిపురుష్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే

0
95

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నారు, ఈ సినిమా తర్వాత రెండు పెద్ద సినిమాలు ఒకే చేశారు, ఇక తాజాగా రాధేశ్యామ్ షూటింగ్ కూడా ఇటీవల ఇటలీలో పూర్తి చేసుకున్నారు చిత్ర యూనిట్.

ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు, ఇక దీని తర్వాత ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లే,రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్.. తన నెక్ట్ చిత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించే ఆదిపురుష్ చేయనున్నారు.

అయితే ఆదిపురుష్ షూటింగ్ గురించి ఓ వార్త వినిపిస్తోంది, సంక్రాంతి తర్వాత ఈ సినిమాకి సంబంధించి కొంత మేర షూట్ జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి, ఓ షెడ్యూల్ షూట్ చేసి, తర్వాత ఈ ఎడిటింగ్ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేస్తారట, ఆ తర్వాత వచ్చే ఏడాది చివర్లో షూట్ చేస్తారు అని తెలుస్తోంది, అందుకే జనవరి నుంచి కొందరి డేట్స్ కూడా దర్శకుడు ఓం రౌత్ తీసుకున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.