తన స్నేహితుడి విమానం తీసుకున్నప్రభాస్ – ఎక్కడికైనా అందులోనే జర్నీ

తన స్నేహితుడి విమానం తీసుకున్నప్రభాస్ - ఎక్కడికైనా అందులోనే జర్నీ

0
102

ఎక్కడ చూసినా కరోనా విలయమే ఏది ముట్టుకోవాలి అన్నా కరోనా టెన్షన్ వస్తోంది.. ఇక సినిమా పరిశ్రమ వారు అయితే ఇతర దేశాలు వెళ్లి షూటింగ్ చేయాలి అంటే రిస్క్ అయినా చేయడానికి ముందుకు వెళుతున్నారు, ఇటీవల ప్రభాస్ కొత్త చిత్రం రాధేశ్యామ్ టీమ్ ఇటలీ వెళ్లి అక్కడ ఓ షెడ్యూల్ షూట్ చేసుకువచ్చారు.

అయితే ప్రభాస్ తన జాగ్రత్తలో తానున్నాడు. ముఖ్యంగా షూటింగ్ కు వెళ్లినపుడు జనంతో కలవకుండా ఉండటానికి ప్లాన్ చేసుకున్నాడు. తను ఫారెన్ కు షూట్ కోసం వెళ్లినపుడు ఫ్లైట్ జర్నీ చేయాలి.. అందుకే తన ఎన్నారై ఫ్రెండ్ కు ఉన్న ఓ ప్రైవేట్ ఫ్లైట్ ని తెచ్చుకున్నారట, ఆయన ఫారెన్ కు వెళితే ఇందులోనే వెళుతున్నారు.

రాధే శ్యామ్ కోసం ఇటలీ వెళ్లారు ప్రభాస్. వచ్చేటప్పుడు తన ఫ్లైట్ లోనే వచ్చారు. ముంబై వెళ్లి ఆదిపురుష్ సినిమా గురించి చర్చిండానికి కూడా ఈ ప్రైవేట్ ఫ్లైట్ లోనే వెళ్లారు అని తెలుస్తోంది, అయితే కొద్ది రోజులు ఇది తన దగ్గరే ఉంచుతాను అని తన ప్రాణ మిత్రుడికి తెలిపారట అతను ఎన్నారై అని తెలుస్తోంది.