రైలు ప్రయాణికులు ఇప్పుడు ఎక్కువగా ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు, అయితే తాజాగా ఇండియన్ రైల్వేస్
ఐఆర్సీటీసీ కొన్ని రూల్స్ టికెట్ బుకింగ్ పై తెలియచేసింది, ఇక పై రైలు ప్రయాణికులు ప్రయాణానికి ముందు కూడా రిజర్వేషన్ టికెట్ పొందవచ్చు.
రైళ్లు బయలుదేరాల్సిన నిర్ణీత సమయానికి 30 నిమిషాల ముందు సెకెండ్ రిజర్వేషన్ ఛార్ట్ సిద్ధం చేస్తారు. ఈ సమయంలో ప్రయాణికులు ఎవరైనా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే సెకండ చార్ట్ లో మీకు టికెట్ బుక్ అవుతుంది, ఈ సమయంలో అరగంటలో కూడా మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు, లేదా స్టేషన్ లో టికెట్ పొందవచ్చు.
కరోనా మహమ్మారికి ముందు, కేవలం ఒకే ఛార్ట్ సిద్ధం చేసేవారు. అదికూడా రైలు నిర్ణీత సమయానికి 4 గంటల ముందు చేసేవారు. ఇప్పుడు రూల్స్ మార్చారు, చాలా వరకూ కొన్ని రైళ్లల్లో టికెట్లు మిగులుతున్నాయి, వీటిని మరొకరు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని తాజాగా కల్పిస్తున్నారు, ఒకవేళ మీరు ప్రయాణం మానుకోవాలి అంటే కచ్చితంగా
సెకెండ్ ఛార్ట్ సిద్ధం చేయకముందే టిక్కెట్ కేన్సిల్ చేసుకోవాలి.