కొడుకుని చంపిన తల్లి… రీజన్ తెలిస్తే షాక్ అవుతారు…

కొడుకుని చంపిన తల్లి... రీజన్ తెలిస్తే షాక్ అవుతారు...

0
88

ఏపీలో దారుణం జరిగింది… తల్లి తన కడుపున పుట్టిన కొడుకుని హతమార్చింది… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… విజయనగరం జిల్లా మక్కువ మండలం కొండ బుచ్చము పేటకు చెందిన గౌరీశంకర్ మద్యానికి బానిసైయ్యాడు… దీంతో అతని భార్యతన పుట్టింటికి వెళ్లిపోయింది…

ఇక అప్పటినుంచి గౌరీశంకర్ తన తల్లి ఈశ్వరమ్మ దగ్గరే ఉంటున్నాడు… అప్పటి నుంచి ఎక్కువగా తాగి తన తల్లిని డబ్బులు అడిగేవాడు లేదు అని చెబితే ఆమెను కొట్టి డబ్బులు తీసుకునేవాడు… దీంతో విసిగిపోయిన తల్లి కన్న కొడుకును హతమార్చింది…

మద్యం మత్తలో ఉన్న కొడుకుకు కాళ్లు చేతులు కట్టి తాడుతో గొంతు కూడా బిగించిన తల్లి కట్టెతో కొడుకు తలపై గట్టిగా కొట్టింది… దీంతో గౌరీశంకర్ అక్కడికక్కడే మృతి చెందారు…. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈశ్వరమ్మని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు…