బంగారం కొనుగోలు చేయాలి అని భావించే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి, బంగారం ధర భారీగా తగ్గింది, ధనత్రయోదశి రోజున బంగారం తగ్గుదలతో ఇటు బంగారం కొనాలి అని చూసేవారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
బంగారం తగ్గితే వెండి ధర కూడా మార్కెట్లో తగ్గుముఖం పట్టింది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,640 తగ్గుదలతో రూ.51,380కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,500 తగ్గింది. దీంతో ధర రూ.47,100కు చేరింది
ఇక భారీగా తగ్గడంతో కొనుగోళ్లు ఊపు అందుకున్నాయి.
బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ.3,500 తగ్గుదలతో వెండి ధర రూ.61,900కు
చేరింది, భారీగా గడిచిన వారంలో వెండి ధర ఇదే తగ్గడం,ఇక వచ్చే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.