తాళికట్టిన 24 గంటలకే అత్తగారింటికి వచ్చిన మాజీ ప్రియుడు

తాళికట్టిన 24 గంటలకే అత్తగారింటికి వచ్చిన మాజీ ప్రియుడు

0
92

ఎంతో ఆనందంతో పెళ్లి జరిగింది, దాదాపు 34 ఏళ్లు వచ్చిన తర్వాత అతనికి వివాహం అవ్వడం ఆమె కూడా అందాల బొమ్మలా ఉండటంతో ఎంతో ఆనందించాడు, అయితే ఆ ఆశలు ఆవిరి అయ్యాయి, రాత్రి 10 గంటలకు తాళికట్టాడు, ఉదయం 7 గంటలకు వారి ఇంటికి ఆమెని తీసుకువచ్చారు పెళ్లి కొడుకు కుటుంబం. బీహర్ లో జరిగింది ఈ ఘటన.

అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో సడెన్ గా తన మిత్రులను తీసుకుని వరుడు ఇంటి ముందుకు వచ్చాడు ఆమె మాజీ ప్రియుడు, ఇద్దరం ప్రేమించుకున్నాం, నాకు డబ్బు లేదు ఉద్యోగం లేదు అని మీకు బలవంతంగా ఆమెక ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు అని ప్రియుడు వరుడికి తెలిపాడు.

దీంతో ప్రియుడ్ని చూసిన ఆమె అతని దగ్గరకు వెళ్లి కన్నీరు పెట్టుకుంది, ఇది సినిమా ఎపిసోడ్ ని మించిపోవడంతో, ఇక ఆమెని ప్రియుడికి ఇచ్చి పంపించేశాడు వరుడు, అయితే యువతి తండ్రి మాత్రం ప్రియుడిపై పెళ్లికొడుకు కుటుంబంపై కేసు పెట్టారు, తమ కుమార్తెని ఎలా ఇలా పంపిస్తారు అని రివర్స్ కేసు పెట్టాడు