బాలకృష్ణ, బోయపాటి సినిమాలో హీరోయిన్ ఆమేనా

బాలకృష్ణ, బోయపాటి సినిమాలో హీరోయిన్ ఆమేనా

0
89

సింహ లెజెండ్ చిత్రాల తర్వాత బాలయ్య బాబు బోయపాటి చేస్తున్న మూడవ చిత్రం పై ఎంతో ఆసక్తి పెరిగింది అభిమానుల్లో.. సినిమా గురించి ఎప్పుడు ఎప్పుడా అని చూస్తున్నారు బాలయ్య బాబు అభిమానులు, అయితే ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఇంకా తేలడం లేదు, చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కాని ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు..

ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది, ఇక ఆమె ఫైనల్ అని అంటున్నారు, ఆమె ఎవరో కాదు
ప్రగ్య జైస్వాల్ … కంచె- మిర్చి లాంటి కుర్రోడు-గుంటూరోడు వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ప్రగ్య జైస్వాల్ ని ఈ చిత్రంలో తీసుకున్నారు అనే వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది.

టాలీవుడ్ లో ఆమెకి ఈ మధ్య పెద్ద అవకాశాలు రాలేదు, అయితే ఇప్పుడు మళ్లీ బాలయ్యతో ఈ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది, ఈ సినిమాతో మళ్లీ ఆమె తన కెరియర్ ని మలచుకోవాలి అని చూస్తోందట
మరో కథానాయికగా మలయాళ సుందరి పూర్ణను ఇప్పటికే తీసుకున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.