ధనత్రయోదశి రోజు యమదీపం పెట్టి పూజించండం వల్ల మీ భర్తకు ఈ బాధలు ఉండవు

ధనత్రయోదశి రోజు యమదీపం పెట్టి పూజించండం వల్ల మీ భర్తకు ఈ బాధలు ఉండవు

0
119

పూర్వం హేమరాజు అనే ఒక మహా రాజు ఉండేవాడు.. ఆయనకు పుత్రుడు సులోచనుడు ఉన్నాడు, కాని ఆయనకు వివాహం జరిగిన నాలుగో రోజు మృత్యుగండ ప్రమాదం ఉంది, ఈ విషయం అక్కడ జ్యోతిష్య పండితులు రాజుకి తెలియచేస్తారు, దీంతో కుమారుడి కోసం ఎంతో బాధపడతాడు హేమరాజు.

అయితే అతనికి వివాహం చేసి నాల్గోరోజున ఎంతో బాధతో ఉంటారు, యముడు వచ్చి తన కుమారుడ్ని తీసుకువెళతాడు అని దుఖసాగరంలో ఉంటారు, కాని ఇంటికి వచ్చిన కోడలికి ఈ విషయం చెప్పరు, ఆమె ఆరోజు సాధారణంగా పూజ చేస్తోంది, అమ్మవారికి నగలు పెట్టి లక్ష్మీ పూజ చేసి యమ దీపం వెలిగించి గుమ్మంలో పెట్టింది.

మృత్యు దోషం ప్రకారం మృత్యు ఘడియలలో యమ ధర్మరాజు అదే సమయంలో సర్ప రూపంలో వచ్చాడు .ఆ సర్ప రూపంలో వచ్చిన యమధర్మరాజు గుమ్మంలో అడుగు పెట్టగానే ఆమె చేసిన పూజలు అమ్మవారికి నగలు అలంకరించి పూజ చేయడం అన్నీ చూసి యముడు అక్కడే ఉండిపోయాడు.
ఈ సమయంలో యమ గడియలు దాటిపోయాయి.

అందుకే యమ ప్రీత్యర్థం గుమ్మం బయట క్రింద ముగ్గు వేసి యమ దీపం పెట్టి పూజించండం ఆనవాయితిగా వస్తోంది. భర్తలకు ఎలాంటి దోషం ఉన్నా పోతుంది అని పెద్దలు ఈ రోజు ఇలా స్త్రీలతో పూజలు చేయిస్తారు.