పుష్ప చిత్రంలో విలన్ అతనేనా తెరపైకి ఆ నటుడి పేరు

పుష్ప చిత్రంలో విలన్ అతనేనా తెరపైకి ఆ నటుడి పేరు

0
108

పుష్ప చిత్రంలో నటిస్తున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్, ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు, ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది, ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో షూటింగ్ నిలిపివేశారు చిత్ర యూనిట్, అయితే ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారు అంటే, ఇంకా దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు చిత్ర యూనిట్ కూడా పలువురిని పరిశీలిస్తోంది.

ముందు తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఈ పాత్రకు బుక్ చేశారు. అయితే, తర్వాత డేట్స్ సమస్య రావడంతో ఆయన తప్పుకున్నాడు. ఇక తర్వాత హిందీ నటుల పేర్లు వినిపించాయి, కాని వారు తప్పుకున్నారు, ఇక తాజాగా మరో నటుడి పేరు వినిపిస్తోంది, తమిళ నటుడు ఆర్య పేరు ఇప్పుడు వినిపిస్తోంది.

గతంలో బన్నీ నటించిన వరుడు సినిమాలో ఆర్య విలన్ గా నటించాడు. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి, అయితే ఇప్పుడు కూడా ఆయనకు అవకాశం రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి..తాజాగా తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో రెండు రోజుల క్రితం ప్రారంభించారు సినిమా. ఈ సినిమా పై బన్నీ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.