మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది అనే వార్త విన్నా తర్వాత అభిమానులు షాక్ అయ్యారు, ఆయన కోలుకోవాలి అని అందరూ కోరుకున్నారు, అయితే తాజాగా చిరంజీవి ఇంట్లోనే ఉంటున్నారు, హోమ్ క్వారంటైన్ లో ఉన్న చిరంజీవి నేడు గుడ్ న్యూస్ చెప్పారు..
ఆయన కు తాజాగా కరోనా పరీక్షల్లో నెగిటీవ్ వచ్చింది, ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు, గత నాలుగు రోజులుగా కరోనా కాలం రెండూ నన్ను కన్ఫూజ్ చేశాయి, ఆదివారం టెస్ట్ లో పాజిటీవ్ అని వచ్చింది.
రెండు రోజులైనా తనలో ఎలాంటి లక్షణాలు లేకపోయేసరికి తనకే అనుమానం వచ్చిందని… దీంతో అపోలో ఆసుపత్రికి వెళ్లానని చెప్పారు.డాక్టర్లు తనకు సీటీ స్కాన్ తీసి ఛాతీలో ఎలాంటి ట్రేసెస్ లేవని నిర్ధారణకు వచ్చారని అక్కడ టెస్ట్ చేస్తే నెగిటీవ్ వచ్చింది, ఎందుకైనా మంచిది అని మళ్లీ టెనెట్ ల్యాబ్ లో టెస్ట్ చేయించా అక్కడ నెగిటీవ్ వచ్చింది, ఆదివారం చేయించిన చోట మళ్లీ చేయించా అక్కడ నెగిటీవ్ వచ్చింది, మొత్తానికి ఆదివారం రోజు వచ్చిన రిజల్ట్ లో ఆ టెస్ట్ కిట్ ఫెయిల్ అని తేల్చారు వైద్యులు. చిరుకి కరోనా నెగిటీవ్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.