ఆహా యాప్ లో ఇప్పుడ సమంత కొత్త ప్రొగ్రాం సామ్ జామ్ గురించి ఆమె అభిమానులు టాలీవుడ్ లో అందరూ చర్చించుకుంటున్నారు, సమంత సినిమాలు అన్నీ సక్సెస్…ఇక టాక్ షో కూడా సక్సెస్ అంటున్నారు ఆమె అభిమానులు. అయితే ఆమె ఈ టాక్ షోలకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే దానిపై కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ప్రకారం.. దాదాపు 10 ఎపిసోడ్స్ కి ఆమె 1.5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సమంత మార్కెట్ తో పోలిస్తే అది చాలా తక్కువే అంటున్నారు, కాని అల్లు వారితో ఆహా టీమ్ తో ఉన్న రిలేషన్ వల్ల అంత తక్కువ రెమ్యునరేషన్ కు ఆమె షో చేస్తోంది అని టాక్ వినిపిస్తోంది.
అభిమానులు మాత్రం ఈ టాక్ షో గురించి తెగ మాట్లాడుకుంటున్నారు,ఇందుకు సంబంధించిన ప్రోమోలు కూడా హైప్ క్రియేట్ చేశాయి… సామ్ జామ్ షోలో మొదటి గెస్ట్ విజయ్ దేవరకొండ.. ఇంకా పది ఎపిసోడ్ లు రానున్నాయి. ఇక బాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో ఫేమస్ అయింది కాఫీ విత్ కరణ్ షో అలా ఉంటుంది అని భావించారు, అంత హైప్ అయితే రాలేదు అంటున్నారు చూసిన వారు, అయితే వచ్చే కొలది మంచి హైప్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు అందరూ.