లోన్ కోసం అప్లై చేస్తున్నారా ఈ సిబిల్ స్కోర్ గురించి తప్పక తెలుసుకోండి

లోన్ కోసం అప్లై చేస్తున్నారా ఈ సిబిల్ స్కోర్ గురించి తప్పక తెలుసుకోండి

0
98

ఈ రోజుల్లో లోన్ తీసుకోవడం చాలా సులభం.. కాని బ్యాంకులు మాత్రం లోన్ అప్రూవల్ చేయడం అంత సులువు కాదు అనేది తెలుసుకోవాలి, ఎందుకు అంటే మీ పాత హిస్టరీ మీ పాత పేమెంట్లు అన్నీ కూడా మీరు తీసుకోబోయే కొత్త లోన్లపై ప్రభావం చూపిస్తాయి, ముఖ్యంగా మీ సిబిల్ స్కోర్ పైన ఆధార పడి ఉంటాయి, వాట్ ఈజీ్ సిబిల్ స్కోర్ అసలు ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం.

మీరు బ్యాంకులో లేదా ఎన్ బీ ఎఫ్ సీలో లోన్ కోసం అప్లై చేసుకున్న ప్రతిసారి లోన్ ఎంక్వైరీ జనరేట్ అవుతుంది. దీని వల్ల క్రెడిట్ స్కోర్పై ఎఫెక్ట్ పడొచ్చు. ఇకమీరు బ్యాంకులో లోన్ అప్లై చేయగానే బ్యాంకులు ముందు మీ సిబిల్ స్కోర్ చూస్తాయి, మీరు గతంలో తీసుకున్న లోన్లకు రీ పేమెంట్ ఎలా చేశారు, అలాగే మీ పేరున ఉన్న గోల్డ్ లోన్ హోమ్ లోన్ ఎలా పే చేస్తున్నారు ఇలా అన్నీ వివరాలు మీ క్రెడిట్ స్కోరులో ఉంటాయి.

సో ఇలా మీరు ఏ బ్యాంకులో తీసుకున్నా సిబిల్ లో జనరేట్ అవుతుంది, మీరు ఇప్పటి వరకూ ఎక్కడ ఎలా లోన్ అప్లై చేశారు ఎందుకు రిజక్ట్ అయింది ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇక మీరు కచ్చితంగా లోన్ తీసుకుంటే మీ ఖాతా ఫర్ ఫెక్ట్ గా ఉండాలి, అంతేకాదు మీరు బ్యాంకు ఖాతాల్లో నగదు కూడా మెయింటైన్ చేయాలి లేకపోతే అది కూడా ప్రభావం చూపిస్తుంది, ఎన్నడూ ఖాతా మైనస్ లో ఉంచుకోవద్దు.