రైతులకు ఏడాదికి రూ.6,000 కేంద్రం సాయం అందడం లేదా ఇలా చేసి చూడండి

రైతులకు ఏడాదికి రూ.6,000 కేంద్రం సాయం అందడం లేదా ఇలా చేసి చూడండి

0
90

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక కొత్త పథకాలను అమలుచేస్తోంది, అంతేకాదు రైతుల కోసం అనేక స్కీములు తెచ్చి వారికి ఆర్ధికంగా సాయం చేస్తోంది. ఇందులో ప్రధానంగా దేశంలో అమలు చేస్తోంది ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్.
రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తోంది కేంద్రం, అన్నీ స్టేట్స్ లో ఇది అమలు చేస్తోంది.

రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తున్నారు, మొత్తం కేంద్రం రైతుల పేర్లు నమోదు చేయించుకుని దేశంలో 11 కోట్ల మందికి ఈ నగదు అందచేస్తోంది, అయితే ఇంకా వేలాది మంది ఈ స్కీమ్ కింద నగదు రావడం లేదు అంటున్నారు, మీరు వ్యవసాయశాఖ అధికారుతో మాట్లాడితే మీకు నగదు సాయం ఎందుకు రావడం లేదో తెలియపరుస్తారు.

ఏ స్టేట్ లో అయినా మీ దగ్గరిలోని అగ్రికల్చర్ ఆఫీసర్ను కలవండి. అయినా మీకు సమస్య పరిష్కారం కాకపోతే వీరిని కాంటాక్స్ అవ్వండి, ఇవి హెల్ప్ లైన్ నెంబర్లు.

pmkisan-ict@gov.inకు మెయిల్ చేసి మీ డీటెయిల్స్ ఆధార్ అన్నీ తెలపండి
PM Kisan Toll Free Number: 18001155266
PM Kisan Helpline Number: 155261
PM Kisan Landline Numbers: 011-23381092, 23382401
PM Kisan’s new helpline: 011-24300606
PM Kisan helpline: 0120-6025109