ఆధార్ కార్డు కి ఇచ్చిన మొబైల్ నెంబర్ మార్చారా? ఇలా కొత్తది అప్ డేట్ చేసుకోండి

ఆధార్ కార్డు కి ఇచ్చిన మొబైల్ నెంబర్ మార్చారా? ఇలా కొత్తది అప్ డేట్ చేసుకోండి

0
125

ఆధార్ కార్డు మనకు కీలకమైన డాక్యుమెంట్, ముఖ్యంగా చాలా పనులు ఆగిపోతాయి మీకు ఆధార్ కార్డ్ లేకపోతే, ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలకు కూడా ఈ ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైంది. ఇక మీరు బ్యాంకు ఖాతా తెరవాలి అన్నా కచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. ఇక రేషన్ కార్డుకి కూడా ఆధార్ చాలా ముఖ్యం, అందుకే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆధార్ కార్డ్ నమోదు చేసుకోవాలి.

ఇక మీరు ఆధార్ తీసుకుంటే దానికి మీ మొబైల్ నెంబర్ కూడా కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డును లింక్ చేసుకుంటే మీకు ఓటీపీ వస్తుంది. అయితే మీరు మొబైల్ నెంబర్ మార్చినా లేదా మీరు ఆధార్ కు ఇచ్చిన సిమ్ నెంబర్ పనిచేయకపోయినా మీకు ఇబ్బంది.

ఇలాంటి వారు మళ్లీ కచ్చితంగా ఆధార్ కార్డుతో కొత్త మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. మీరు ఆధార్ సెంటర్ కు వెళ్లి అక్కడ ఆధార్ కరెక్షన్ ఫామ్ తీసుకుని అక్కడ మీ మొబైల్ నెంబర్ కొత్తది రాయాలి, దానిని మీకు ఆధార్ కు అప్ డేట్ చేస్తారు, దీని కోసం మీ దగ్గర 25 రూపాయల చార్జ్ ఉంటుంది, అంతేకాదు తాజాగా కొత్త పీవీసీ ఆధార్ కార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే.