రెండు వసంతాలు పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ రైడ్ “టాక్సీవాలా”..!!

రెండు వసంతాలు పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ రైడ్ "టాక్సీవాలా"..!!

0
105

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘టాక్సీవాలా’.. వైవిధ్యమైన కథనం తో వచ్చిన ఈ సినిమా విడుదల అయి రెండు వసంతాలు పూర్తి చేసుకుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరో గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఈ సినిమా తో మరోసారి తన సత్తా చాటాడు.. 2018 నవంబర్ 17 న విడుదలైన టాక్సీవాలా చిత్రం వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులకు ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చిందని తప్పకుండా చెప్పొచ్చు..

అప్పటి వరకు అగ్రెసివ్ క్యారెక్టర్లు చేసిన విజయ్ ఇలాంటి సినిమాలు కూడా చేస్తాడా అని అందరు అనుకున్నారు. టాక్సీ డ్రైవర్ గా విజయ్ దేవరకొండ నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో కట్టిపడేసిన విజయ్ కామెడీ సీన్స్ లో అయితే తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించాడు.

వెండితెర మీదనే కాదు బుల్లితెర పై కూడా టాక్సీవాలా సంచలన రికార్డులు నమోదు చేసింది. టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ తో పైరసీ కి గురైన ఓ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవడం అంటే ప్రేక్షకుల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ కి క్రేజ్ కి అద్దం పడుతుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. యువి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 సంస్థ లు కలిసి ఈ సినిమా ను నిర్మించగా రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించగా మాళవిక నాయర్ ఓ కీలక పాత్రలో నటించింది.