గుడ్ న్యూస్ – కరోనా టీకా ధర ఎంతో చెప్పేసిన సీరం ఎంతంటే

గుడ్ న్యూస్ - కరోనా టీకా ధర ఎంతో చెప్పేసిన సీరం ఎంతంటే

0
90

ఈ కరోనాకి టీకా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఇక ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనికా సంస్థ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ను మన భారత్ లో సీరం ఇన్స్టిట్యూట్ పంపిణీ చేయనుంది, ఇక దీనిపై ఎప్పుడు గుడ్ న్యూస్ వస్తుందా అని అందరూ చూస్తున్నారు, అయితే మిగిలిన కంపెనీల కంటే ఈ టీకా రేటు కూడా తక్కువే ఉంటుంది అని అందరూ భావించారు.

తాజాగా దీనిపై కీలక ప్రకటన చేసింది సీరం….కోవిషీల్డ్ పేరుతో ఈ వ్యాక్సిన్ రానుంది.. చివరి దశ క్లినికల్ ట్రయిల్స్ జరుగుతున్నాయి. సీరం సంస్థ సీఈవో అదర్ పూనావాలా గుడ్ న్యూస్ అందించారు ఈ సమయంలో …2021 ఫిబ్రవరి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకువస్తామని ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ పిల్లలు వృద్దులకి అందిస్తామని , దీని ఎఫెక్ట్ ఎవరిపై ఉంటుంది అని భావిస్తున్నారో వారికి అందచేస్తాము అని తెలిపారు.

ఏప్రిల్కు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అదర్ పూనావాలా వెల్లడించారు. ఇక దీని ధర రెండు డోసులు 1000 రూపాయలు ఉంటుంది అని స్పష్టం చేశారు, ఇక మొత్తం అందరికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే కచ్చితంగా 2024 సమయం పడుతుంది అని తెలిపారు ఆయన.