ఈ శీతాకాలం వచ్చింది అంటే చలి పులి వణికిస్తుంది,ఇక పొల్యుషన్ఉన్న నగరాల్లో ఇది ఛాతీ నొప్పి ఉబ్బసం ఆస్తమాని మరింత పెంచేస్తుంది, అందుకే ఈ సమస్యలు ఉన్న వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరుగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్య నిపుణులు సూచించారు. దీంతో ఆమె దిల్లీ నుంచి కొద్ది రోజులు వేరే ప్రాంతానికి రానున్నారు.
సోనియా గోవా లేదా చెన్నైకి వెళ్లతారని, కొంతకాలం అక్కడే ఉంటారని వెల్లడించారు నేతలు. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక కూడా వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఆమెకి కొంత కాలంగా ఛాతీలో ఇన్పెక్షన్ వేధిస్తోంది, ఈ సమస్యలతో ఆమె ఇక్కడ ధిల్లీలో ఉంటే ఈ సమయంలో అది మరింత పెరుగుతుంది అంటున్నారు.
ఢిల్లీలో పెరిగిన కాలుష్యం కారణంగా సోనియా గాంధీకి ఉబ్బసం సోకే అవకాశాలు అధికమని, ఆపై ఛాతీ నొప్పి తీవ్రతరం కావచ్చని వైద్యులు హెచ్చరించారు. దీంతో ఆమెని కుటుంబ సభ్యులు వేరే స్టేట్ కు తీసుకువస్తారు, ఇక్కడ నుంచి పార్టీ నేతలతో ఆమె మాట్లాడతారు అని తెలుస్తోంది.