నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ చేయడానికి కొన్ని కారణాలు ఇవే – గర్భవతులు తెలుసుకోండి

నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ చేయడానికి కొన్ని కారణాలు ఇవే - గర్భవతులు తెలుసుకోండి

0
82

ఇప్పుడు చాలా మందికి నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ చేస్తున్నారు వైద్యులు, అయితే వైద్యులు చెప్పేది ఓ మాట ఉంది, సిజేరియన్ చేయడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉంటాయి, తల్లి బిడ్డ ఆరోగ్యం విషయంలో వైద్యులు స్కానింగ్ పరీక్షలు అన్నీ చేసి ఏది బెటర్ అనేది కూడా చెబుతారు, అయితే నార్మల్ డెలివరీ అయితే ఆస్పత్రి నుంచి త్వరగా వెళ్లవచ్చు, అలాగే రికవరీ వేగంగా ఉటుంది అని చాలా మంది దీనికి ప్రిఫర్ చేస్తారు.

కాని వైద్యులు ఎందుకు ఇలా సిజేరియన్ చేస్తారు అంటే.. పలు కారణాలు చెబుతున్నారు… మరి అవి కూడా తెలుసుకుందాం, ముఖ్యంగా కవలలు ఉంటే కచ్చితంగా సిజేరియన్ చేయడానికి చూస్తారు, తల్లి బిడ్డల క్షేమం కోసం, అలాగే ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా ఆపరేషన్ చేస్తారు.

జనన ద్వారం బిడ్డకి జన్మనివ్వడానికి అనువుగా తెరుచుకోకపోవడం వల్ల కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, ఇక తల్లికి బీపీ ఉన్నా హై బీపీ ఉన్నా ఇలా సిజేరియన్ చేస్తారు, అలాగే బిడ్డ పొజిషన్ నార్మల్ డెలివరీకి అనుకూలంగా ఉండాలి.. లేకపోతే ట్రై చేయరు, లోపల బిడ్డ తల పెద్దదిగా ఉన్నా నార్మల్ డెలివరీ చేయరు, ఇక బేబీ హార్డ్ పెరిగిపోవడం జరిగితే కూడా చేయరు.
బిడ్డ బొడ్డు తాడు కట్ అయిపోవడం, ఇందువల్ల బేబీకి ఆక్సిజెన్ సప్లై జరగదు. అందుకే ఆపరేషన్ చేస్తారు, సో ఇలాంటి కారణాల వల్ల నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ చేస్తారు.