శివుడికి వీటితో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి

శివుడికి వీటితో అభిషేకం చేస్తే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి

0
110
Shivaratri Prasadam Recipes

ఈ కార్తికమాసంలో ఏ శివాలయం చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది, ఆ శివయ్య అభిషేక ప్రియుడు అందుకే ఆయనకు ప్రతీ రోజు అభిషేకం చేస్తూనే ఉంటారు, కొన్ని నీళ్లు ఆ శివలింగంపై పోసినా ఆయన ఎంతో ఆనందిస్తాడు ఆయన మన కోరికలు తీరుస్తాడు ..శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి దళాలను ఆయన శిరస్సుపై వుంచేవారికి ఏ అనారోగ్య సమస్యలు ఉండవు ఆర్ధిక ఇబ్బందులు ఉండవు.

అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. మరి శివునికి అభిషేకం చేసే ఈ పూజా అభిషేక ద్రవ్యాలతో మనకు ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం, ముందుగా ఆవుపాలతో స్వామికి అభిషేకం చేస్తే ఇంటిలో సర్వసుఖాలు ఉంటాయి, ఆర్ధిక ఇబ్బంది ఉండదు…ఇక ఆవు పెరుగు బలం ఆరోగ్యం వస్తాయి.తేనె .. తేజో వృద్ధి ఆర్ధిక లాభాలు ఉంటాయి.

ఆవు నెయ్యి…. ఐశ్వర్యాభివృద్ధి వ్యాపార వృద్ది జరుగుతుంది
చెరకు రసం పంచదార …. దుఃఖ నాశనం
సుగంధం … పుత్ర లాభం సంతానానికి అన్నీ విజయాలే
బిల్వ జలం … భోగ భాగ్యాలు- భర్త భార్య పిల్లల ఆరోగ్యం
నువ్వుల నూనె… అపమృత్యు హరణం నూరేళ్ల జీవితం
రుద్రాక్షోదకం … మహా ఐశ్వర్యం నిందలు దూరం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం …. సకల కార్యాభివృద్ధి
విభూది …. అన్నింటి కంటే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది దీని వల్ల.