మహాత్మా గాంధీ భారత దేశ జాతి పిత, ఆయనకు సంబంధించిన వస్తువులు వేలంలో కోట్ల రూపాయల విలువ పలుకుతాయి అనే విషయం తెలిసిందే, తాజాగా ఆయన వాడిన పాకెట్ గడియారం బ్రిటన్లో జరిగిన ఒక వేలం పాటలో 11,82,375 రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ గడియారం కాస్త పగిలిపోయి ఉంది. అయినా దీనిని కొనుగోలు చేశారు, ఈ చేతి గడియారం గురించి చూస్తే.
1944లో ఒక వ్యక్తి తన పట్ల చూపిన ప్రేమకు కృతజ్ఞతగా గాంధీజీ ఈ వాచీని ఆయనకు ఇచ్చారు. ఆ వ్యక్తి మనవడు తాజాగా వాచీని వేలానికి పెట్టాడు. ఇది బ్రిస్టల్ ప్రాంతంలో వేలం పాట వేశారు, భారీ ధర దీనికి వచ్చింది, దీనిని ఎవరు దక్కించుకున్నారు అంటే, అమెరికాకు చెందిన వ్యక్తి సొంతం చేసుకున్నారు.
ఇప్పటికే ఆగస్టులో గాంధీ ధరించిన కళ్ళద్దాలను వేలం వేయగా రూ. 2,56,18,140 ధర పలికాయి. గాంధీ అనుచరుడైన మోహన్ లాల్ శర్మ అనే ఒక వడ్రంగిది ఈ వాచీ, ఆయన గాంధీతోనే ఉండేవారు, దీనిని 1944 లో గాంధీ ఆయనకు ఇచ్చారు,
1975లో ఆయన ఆ గడియారాన్ని తన మనుమడికి ఇచ్చారు. ఇప్పుడు ఇలా వారి కుటుంబం వేలం వేసింది.