దారుణం – చీమల వల్ల చనిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

దారుణం - చీమల వల్ల చనిపోయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

0
116

ఆమె ఇంటిలో బెడ్ రూమ్ కు వెళ్లింది కొద్ది రోజులుగా ఇళ్లంతా చీమలతో సతమతం అవుతున్నారు, పుట్ట కింద చీమలు అన్నీ కలిపి ఏర్పాటు చేశాయి, ఈ సమయంలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన పనికి ఏకంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది.తమిళనాడు రాజధాని చెన్నై అమింజికరైలో దారుణమైన ఘటన జరిగింది అసలు ఏమైంది అనేది చూద్దాం

చెన్నై అమింజికరైలోని పెరుమాల్ ఆలయం స్ట్రీటులో దంపతులు ఉంటున్నారు. వారికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు సంగీత షోలింగనల్లూరులోని ఒక ఐటి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ , ఇక ఇంటిలో చీమల పుట్టలు కనిపించాయి, వెంటనే ఆమె తల్లి కిరోసిన్ పోస్తే మంట పెడితే పోతాయి అని భావించింది.

సంగీతకు చికాకు వచ్చేసింది ఈ చీమలతో. సంగీత తల్లి సహాయంతో చీమలపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది. ఈ సమయంలో ఆమె ఒంటిపై కాస్త కిరోసిన కూడా పడింది.. అప్పటికే మంటలు ఉండటంతో అవి కూడా ఆమెకి అంటుకున్నాయి, కూతురు మంటలు అంటుకోవడంతో కేకలు వేసింది. వెంటనే స్ధానికులు తండ్రి తల్లి మంటలు ఆర్పాలి అని ప్రయత్నించారు. కాని సంగీత మంటల్లో కాలిపోయింది. చివరకు ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు కాపాడలేకపోయారు.