పవన్ సినిమాలో సాయిపల్లవి క్యారెక్టర్ ఫిక్స్

పవన్ సినిమాలో సాయిపల్లవి క్యారెక్టర్ ఫిక్స్

0
93

జనసేన పార్టీ అధినేత, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కొద్దికాలం రాజకీయాలకు విరామం ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు… ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్నాడు… అన్నీ కుదిరి ఉంటే ఈపాటికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల అయ్యేది….

కానీ కరోనా కారణంగా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు.. ప్రస్తుతం పవన్ షూటింగ్ లో పల్గొంటున్నారు.. ఈచిత్రం తర్వాత పవన్ దర్శకుడు క్రిష్ తో ఒక మూవీ చేయనున్నాడు… పీరియాడికల్ మూవీగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో పవన్ బంధిపోటుగా కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అలాగే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

అందులో బాలీవుడ్ కు చెందిన ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ని తీసుకోబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి… కానీ ఇంతవరకు క్లారిటీ రాలేదు… తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హైబ్రీడ్ పిల్ల సాయిపల్లవిని తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఈ చిత్రంలో సాయి పల్లవి జమీందారీ కుటుంబానికి చెందిన యువతి పాత్రలో నటించనున్నట్లు ఫిలినగర్ లో వార్తలు వస్తున్నాయి…