తిరుపతి ఉప ఎన్నికల బరిలో దిగడంపై కాంగ్రెస్ క్లారిటీ…

తిరుపతి ఉప ఎన్నికల బరిలో దిగడంపై కాంగ్రెస్ క్లారిటీ...

0
109
Telangana Congress Party

తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాకముందే కొన్ని రాజకీయ పార్టీలు పట్టు సాధించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఇటీవలే ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థి పేరును కూడా ప్రకటించారు… టీడీపీ తరపున పనబాక లక్ష్మీ బరిలో దిగనుంది…

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంతరకు ప్రకటించనప్పటికీ ఇక్కడ గెలుపు తమదే అనే ధీమాతో ఉంది… ఇక బీజేపీ జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి కాబట్టి బీజేపీ పోటీకి దిగనుంది.. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం తిరుపతి బరిలో దిగనుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు… అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసి రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు… తిరుపతి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు…

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాధరణ పెరుగుతుందని అన్నారు… గతంలో ఏపీకి ప్రధాని మోదీ తిరుమల సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు… అలాగే వైసీపీ హోదా గురించి పార్లమెంటులో ఎంపీలు ఎందుకు మాట్లాడటంలేదని అన్నారు.. ప్రస్తుతం వైసీపీకి ఓటమి భయం పుట్టుకుందని అన్నారు… అందుకే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకడుగు వేస్తోందని అన్నారు తులసిరెడ్డి…