ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.. ముఖ్యంగా మహిళలపై దాడులు చేసినా వేధించినా నేరుగా మరణ దండన విధిస్తారు ఆ దేశాల్లో ..అందుకే ఇక్కడ కఠిన చట్టాలు ఏమైతే అమలు అవుతున్నాయో వాటినే అమలు చేస్తే బాగుంటుంది అని చాలా మంది వివిధ దేశాల్లో కోరుతూ ఉంటారు, అయితే ఇక్కడ దొంగతనం చేసినా చేతులు నరుకుతారు, ఇక మైనర్లపై అత్యాచారం చేస్తే నేరుగా రోడ్డుపై తలనరికి చంపేస్తారు.
రాళ్లతో కొట్టిచంపడం వంటి శిక్షలుంటాయి.పాకిస్థాన్ లోనూ అలాంటి చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ఇకపై అత్యాచారానికి పాల్పడిన వారిని రసాయనాల సాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. ఈ చట్టం తీసుకువచ్చేందుకు పాక్ సిద్దం అవుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయ అంగీకారం ఈ చట్టానికి తెలిపారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే దీనిపై న్యాయశాఖ అధికారులు విశ్లేషకులు వారి అభిప్రాయలు కూడా చెప్పనున్నారు, దీనిపై త్వరలోనే కీలక ప్రకటన రానుందట. మొత్తానికి ఈ చట్టం గురించి అన్నీ దేశాలు చర్చించుకుంటున్నాయి.