తర్వాత సినిమాలో ఆ రిస్క్ చేయనున్న చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి మెగాస్టార్ అనే చెప్పాలి. దాదాపు 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో అగ్రహీరోగా ఎన్నో అవార్డులు రికార్డులు నమోదు చేశారు, ఆయన సినిమా వస్తోంది అంటే సరికొత్త రికార్డులే అని చెప్పాలి…మెగాస్టార్ చిరు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత మరో మూడు చిత్రాలు ఒకే అవుతున్నాయి.

- Advertisement -

ఇక లాక్ డౌన్ వేళ ఆచార్య షూటింగ్ కి బ్రేకులు ఇచ్చారు, తాజాగా సెట్స్ పైకి వెళ్లింది, వచ్చే నెల నుంచి ఆయన షూటింగ్ కు వెళ్లనున్నారు. తర్వాత చిరు లూసీఫర్ రీమేక్ చేయబోతున్నారు. ముందు సుజిత్ పేరు వినిపించింది తర్వాత వినాయక్ పేరు వినిపించింది. తాజాగా తమిళ దర్శకుడు జయం రాజా పేరు దర్శకుడిగా వినిపిస్తోంది. ఇక ఆయనకే ఈ సినిమా అవకాశం ఫైనలా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్లో మోహన్ లాల్, పృథ్వీ రాజ్ హీరోలుగా నటించారు. ఇందులో మోహన్ లాల్కు హీరోయిన్ ఉండదు. మరి తెలుగులో కూడా ఇప్పుడు చిరు ఇందులో హీరోయిన్ లేకుండా నటిస్తారు అని వార్తలు వస్తున్నాయి. అయితే మరి నిజంగా హీరోయిన్ లేకుండా ఆయన నటిస్తారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...