జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది కమెడియన్లకు మంచి గుర్తింపుని ఇచ్చింది, అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కమెడియన్ అవినాష్ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు, ముందు జబర్ధస్త్ అవినాష్ అని అందరూ పిలిచినా ఇప్పుడు బిగ్ బాస్ అవినాష్ అని అందరూ పిలుస్తున్నారు.. ఇక జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పి ఇక్కడకు ఎంట్రీ ఇచ్చాడు అవినాష్.. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఈ విషయం తెలియచేసి బాధపడ్డాడు.
మొత్తానికి అవినాష్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఆటతో అందరిని కట్టిపడేశాడు, ఫ్యామిలీ కామెడీతో ఆకట్టుకున్నాడు, ఇక ఆ షో వారు నాకు ఇక అవకాశం ఇవ్వనుఅన్నారు అనేమాట కూడా చెప్పాడు అవినాష్.. ఇక మరో నాలుగు వారాలు మాత్రమే బిగ్ బాస్ ఉంటుంది, ఇక విన్నర్ అయితే ఒకే లేకపోతే మరి అవినాష్ అడుగులు ఎటువైపు అంటే తాజాగా ఓ మాట వినిపిస్తోంది.
బిగ్ బాస్లోకి వచ్చే ముందే తను మరో షోతో కమిట్ అయి వచ్చాడని టాక్ నడుస్తోంది, అక్కడ మాట తీసుకుని జబర్ధస్త్ ని వదిలేసి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు… బొమ్మ అదిరింది షోలో కనిపించనున్నాడట బిగ్ బాస్ తర్వాత..
జబర్దస్త్ మాజీ జడ్జి నాగబాబు కూడా అవినాష్ కు భరోసా ఇచ్చారు.. చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ …ధన్రాజ్, వేణు లాంటి వాళ్లు అక్కడ ఉన్నారు, ఇక హౌస్ నుంచి వచ్చిన తర్వాత అవినాష్ కూడా ఇక్కడ ఎంట్రీ ఇస్తాడు అంటున్నారు.