తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిర తర్వాత వరుస చిత్రాలు చేస్తున్నారు… ఇప్పటికే ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరు ఇప్పుడు సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నాడు ఈ చిత్రం కరోనా రాకుంటే ఎప్పుడో విడుదల అయ్యేది…
కానీ లాక్ డౌన్ కారణంగా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు… ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత చిరు మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ రీమేక్ లో నటించనున్నాడు… ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన రైట్స్ ను సొంతం చేసుకున్నారు… అయితే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు…
మెదట్లో సాహో డైరెక్టర్ సుజిత్ అలాగే బాబి, వీవీ వినాయక్, హరీష్ శంకర్, పేర్లు వినిపించాయి… తాజాగా తమిళ దర్శకుడు మోహన్ రాజా పేరు తెరమీదకు వచ్చింది… మలయాళ సినిమాలో మోహన్ లాల్ కు హీరోయిన్ ఉండదు… తెలుగు రీమేక్ లో చిరింజీవి ఇమేజ్ కు కథను చేంజ్ చేసి హీరోయిన్ పాత్ర ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి… అయితే తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ పాత్ర కొత్తగా సృష్టించలేదని వార్తలు వస్తున్నాయి…