తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరో రవి తేజ ప్రస్తుతం క్రాక్ మూవీ చేస్తున్నాడు… ఈ చిత్రం తర్వాత రమేష్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు… దాని తర్వాత మరో దర్శకుడు నక్కిన త్రినాథ రావుతో ఒక మూవీ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి…
ఇది ఇలా ఉంటే మాస్ రాజా క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి… దర్శకుడు మారుతి ఫ్యామిలీ మొత్తం ఎంటర్ టైన్ అయ్యే సినిమాలు చేసే డైరెక్టర్ గా పేరు తెచ్చున్నాడు…
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు… మరికొందురు రవితేజ మారుతి కాంబోలో వచ్చే మూవీ సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు… 2021 మొదట్లో ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లి ఆ ఇయర్ ఎండింగ్ కు సినిమాను రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…
—