దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గతంలో ఆయన ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు… ఆయన చిత్రాల ద్వారా చాలామంది స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.. తాజాగా ఆయన గురించి ఒక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది…
దశాబ్దాలుగా కెమెరా వెనకుండి అద్బుతమైన చిత్రాలను తీసిన ఆయన ఇప్పుడు కెమెరా ముందుకు వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి… అది కూడా హీరోగా… ఈ చిత్రానికి తనికెళ్ల భరణీ దర్శకత్వం వహిస్తున్నాడట… అంతేకాదు ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉంటారట…
ఇప్పటికే రమ్యకృష్ణ, శ్రియ, సమంత ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేశారని ఇక వారితో పాటు మరో కొత్త హీరోయిన్ ని పరిచయం చేయనున్నారని వార్తలు వస్తున్నాయి… ఈ చిత్రానికి పాటలను చంద్రబోస్ రాస్తుండగా కిరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.