ఆ ఒక్కసాంగ్ కి 58 లక్షలు బిబీ సంపాదన దానికే రాహుల్ కి బిగ్ షాక్

-

బిగ్ బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో ఓ సంచలనం అనే చెప్పాలి, ఏ పోస్టు పెట్టినా పాట పాడినా లక్షల్లో జనాలకి రీచ్ అవుతుంది, తన పాటలు సొంత ఆల్బమ్స్ తో ఎంతో ఫేమస్ అయ్యాడు రాహుల్, అయితే
రాహుల్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజర్ కమ్ సింగర్గా సత్తా చాటాడు. ఇటీవల ఓ బేబీ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ విడుదల చేశాడు.

- Advertisement -

అయితే దీనికి రాహుల్ అనుకున్నంత ఫేమ్ రాలేదు, డబ్బు కూడా బాగా నష్టపోయాడు రాహుల్.ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.58 లక్షలు ఖర్చుచేశాడు రాహుల్. అన్నపూర్ణ స్టుడియోలో భారీ సెట్లు వేసి..మోడల్స్ తో అదరగొట్టే సాంగ్ చేశాడు, యష్ మాస్టర్ కొరియోగ్రఫీ జరిగింది, మూడు రోజులు భారీ ఎత్తున షూట్ చేశారు.

అయితే దీనికి 30 లక్షలు నిర్మాతలు పెట్టుకుంటే మిగిలిన 28 లక్షలు రాహుల్ పెట్టుకున్నారట..తాజాగా ఓ బేబీ సాంగ్ వల్ల తాను చాలా ఎమోషనల్ అయినట్టు చెప్పాడు రాహుల్. ఈ ఒక్క సాంగ్కి రూ. 58 లక్షలు అయ్యాయి.. ఇంకో రూ.30 లక్షలు పెడితే చిన్న సినిమా తీయొచ్చు అని బాధపడ్డాడు.. ఈ సమయంలో ఎమోషనల్ అయ్యి సోషల్ మీడియాలో హార్ట్ బ్రేక్ అయినట్టు పోస్ట్ పెట్టా. ఈ సమయంలో పునర్నవి తన ఎంగేజ్ మెంట్ స్టంట్కి సంబంధించిన పోస్ట్ పెట్టిందట. దీంతో అందరూ ఆ కారణంతో పోస్ట్ పెట్టా అనుకున్నారు అనే విషయం తెలిపాడు. బీబీ విన్నర్ గా వచ్చిన డబ్బుని ఇందులో పెట్టావా బ్రదర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు అతని అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Teja | నిలకడగా శ్రీతేజ ఆరోగ్యం..

పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా...

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...